Friday, November 22, 2024

TS : వ‌ర్షం ప‌డింది… నేల త‌ల్లి త‌డిసింది….

భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణం కాస్తా చ‌ల్ల‌బ‌డింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డ‌డంతో ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.

- Advertisement -

ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్ అర్బన్‌లో 22.8 మిమీ వర్షపాతం నమోదు కాగా.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి లో 9 మిమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా ఎడ్‌బిడ్‌లో 7.3 మి.మీ. వర్షం కురిసింది. ఉగాది పండుగకు చల్లటి వాతావరణం ఏర్పడడంతో ప్రజలకు కాస్త ఎండనుంచి ఊరట లభించిందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement