Monday, November 18, 2024

వర్షాలతో గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు గనుల్లో బొగ్గు ఉత్ప‌త్తికి అంత‌రాయం ఏర్పడింది. మంచిర్యాల‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో బుధ‌వారం ఉద‌యం భారీ వ‌ర్షం కురిసింది. గ‌నుల్లోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో బొగ్గు ఉత్ప‌త్తికి అంత‌రాయం క‌లిగింది. మంచిర్యాల ప‌రిధిలో కేకే, ఆర్‌కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం ఉప‌రిత‌ల గ‌నుల్లో ఉత్ప‌త్తి నిలిచింది. వ‌ర్షం నీరు చేరడంతో 32 వేల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తికి అంత‌రాయం ఏర్ప‌డింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని ఇల్లందు, పిన‌పాకలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. వ‌ర్షంతో ఇల్లందు, కోయ‌గూడెం ఉప‌రిత‌ల గ‌నుల్లో ప‌నుల‌కు ఆటంకం ఏర్ప‌డింది. 8 వేల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తికి అంత‌రాయం ఏర్ప‌డింది. 28 వేల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టి వెలికితీత‌కు అంతరాయం క‌లిగింది. మ‌ణుగూరు ఉప‌రిత‌ల గ‌నుల్లో ఓవ‌ర్ బ‌ర్డెన్ ప‌నుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. భ‌ద్రాద్రి విద్యుత్ ప్లాంట్ 4వ యూనిట్ సివిల్ వెల్డింగ్ ప‌నుల‌కు ఆటంకం క‌లిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement