బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, నిన్న హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ