రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు జిల్లాలో తేలిపాటి చినుకుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికందిన పంటలు నెలమట్టం కాగా, మామిడి పూతలన్ని రాలిపోయాయి నష్టం వాట్టింది. కాగా, మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఉదయం దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, కర్మాన్ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇక, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం జాబితాండలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది.
ఇక, ఈదురు గాలల వర్షం కారణంగా పలుచోట్ల రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. గాలుల కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయాయి. అలాగే, వరి పంట, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది.