Saturday, November 23, 2024

తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు..

రుతుపవన కదలికలు బలహీనంగా ఉండటంతో తెలంగాణలో పలు చోట్ల ఇవాళ రేపు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా మరోవైపు, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ఓ మాదిరి వర్షాలు తెలంగాణలో ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం కురవగా, వనపర్తి జిల్లాలోని పాన్‌గల్‌లో ఒక సెంటీమీటరు వర్షం కురిసింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 2 డెల్టా ప్లస్‌ కేసులు.. సెకండ్ వేవ్ తగ్గలేదుః వైద్యారోగ్య శాఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement