Saturday, November 23, 2024

నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల మందగించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి..అయితే ఎట్టకేలకు నైరుతి ఉత్తరప్రదేశ్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య దిశల నుంచి గాలులు వీస్తు‌న్నాయి. వీటి ప్రభా‌వంతో శుక్రవారం వరకు ఆది‌లా‌బాద్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, నిజా‌మా‌బాద్‌, మంచి‌ర్యాల, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా‌పేట జిల్లా‌ల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement