Tuesday, November 26, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన..

తెలంగాణలో రానున్న మూడు.. నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శుక్ర, శని వారాల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజుల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రదేశములో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ మధ్యబంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంలో మార్పులు కనిపిస్తున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుండి 3.1 కిలో మీటర్ల మధ్య కేంద్రీకృతమై దక్షిణానికి వంగి ఉంది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కి.మీ, 5.8 కి.మీ మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 6 నుండి 12 తేదీల మధ్యలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: మరో వివాదంలో శంకర్… “RC 15” తిప్పలు

Advertisement

తాజా వార్తలు

Advertisement