Monday, July 1, 2024

Breaking: తెలంగాణలో వర్షాలు… హైద‌రాబాద్ లోనూ కుమ్ముడు…

తెలంగాణలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. ఉద‌యం నుంచి హైదరాబాద్ తో స‌హా ప‌లు జిల్లాల‌లో మేఘావృత‌మై ఉంది.. ఇక సాయంత్రం నుంచి హైద‌రాబాద్ లో స‌న్న‌గా చినుకుల‌తో ప్రారంభ‌మై ఒక మోస‌రు వ‌ర్షం కురుస్తున్న‌ది.. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, మియాపూర్, కూక‌ట‌ప‌ల్లి, నాంప‌ల్లి, దిల్ షుక్ న‌గ‌ర్, చిక్క‌డ‌ప‌ల్లి,,ఎల్ బి నగ‌ర్, కొండాపూర్, లింగ‌ప‌ల్లితో స‌హా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు ఈ వ‌ర్షానికి జ‌ల‌మ‌యం అయ్యాయి… కొద్దిపాటి వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల‌లో ట్రాఫిక్ నెమ్మ‌దిగా కొన‌సాగుతున్న‌ది..

ఇక వ‌చ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్ప‌టికే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వాన‌లు కురుస్తున్నాయి..

ఇక శుక్రవారం నుంచి శనివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉపరితల గాలులువీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement