గత రాత్రి హుజురాబాద్ నియోజకవర్గంలో భారీగా వర్షం కురిసింది.. దీంతో కళ్లాలపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.. అలాగే చేతికొచ్చిన వరిపంట నీట మునిగాయి.. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. తమ గోడును పాదయాత్ర చేస్తున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క్ ముందు వెళ్ల బోసుకున్నారు.. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి 14 ఎకరాల్లో వేసిన పంటంతా నష్టపోయాం. దాదాపు 450 బస్తాల ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షం వస్తుందని ముందుగానే పట్టాలు కప్పినా.. నీళ్లు ధాన్యంలోకి వచ్చి చేరాయి. ధాన్యం మొత్తం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు తెరవక పోవడం వల్లే మేమంతా నష్టపోవాల్సి వచ్చిందంటూ హుజురాబాద్ నియోజకవర్గం కు చెందిన రైతు నేరెళ్ల వెంకన్న సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ముందు వాపోయాడు.
రైతు చెప్పిన గోసంతా విన్న భట్టి విక్రమార్క రైతు సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని చెప్పారు. అకాల వర్షంతో నష్టపోయినా ప్రతి రైతుకు నష్టపరిహారం దక్కే వరకే పోరాటం చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
అకాల వర్షంతో నిండా మునిగాం – భట్టి ముందు రైతుల ఆక్రందన
Advertisement
తాజా వార్తలు
Advertisement