తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశముందన్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
- Advertisement -
అలాగే హైదరాబాద్, వనపర్తి, మంచిర్యాల, నాగర్ కర్నూల్, సిరిసిల్ల, పెద్దపల్లి, రంగారెడ్డి, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నారాయణపేట, నిర్మల్, సంగారెడ్డి, ములుగు, జగిత్యాల, వికారాబాద్ జిల్లాలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడనున్నాయి. ఇప్పటికే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కురిసిన వడగండ్ల వర్షం కారణంగా నిజామాబాద్, మెదక్ జిల్లాలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది.