బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురిసాయి. వానలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Radhe Shyam: నా చావుకి వారే కారణం: ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily