ప్రభన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి సుమారు 3.1కి.మీ.ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దాంతో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతా వరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నిలకడగా 21 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాన్న రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా చింతకంలో 2సెం.మీ.ల వర్షపాతం నమోదయింది. కాగా, నేడు, రేపు ఆకాశం మేఘావృతమై హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital