రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రేపు రంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, సంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన..
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement