హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద భాజపా మంగళవారం తలపెట్టిన మహాధర్నా వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ధర్నాను వాయిదా వేసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ తెలిపారు.
తిరిగి ధర్నాను ఎప్పుడు నిర్వహించేది అతి త్వరలో ప్రకటిస్తామన్నారు .అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న తెలంగాణ భాజపా ధర్నాను తలపెట్టిన సంగతి తెలిసిందే. తొలుత ఈనెల 14న, 20న ధర్నాకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్ కుమార్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ సోమవారం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ధర్నా కు అనుమతి ఇచ్చారు.