న్యూఢిల్లీ – హైదరాబాద్ లో గ్రూప్ 2 అభ్యర్ధిని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు.. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆమె మరణించిందంటూ ఆరోపించారు.. ఇది ఆత్మహత్య కాదని హత్య నంటే బిఆర్ఎస్ సర్కార్ ను తప్పుపట్టారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జాబ్ క్యాలెండర్ వస్తుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. “ప్రవళిక ఆత్మహత్య చాలా బాధాకరం.. ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య.. తెలంగాణ యువత ఉపాధి లేక నిరుత్సాహంలో ఉంది” అంటూ కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ ట్విట్ చేశారు
Advertisement
తాజా వార్తలు
Advertisement