తీన్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోని, ఆయనను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మల్లన్న వెలికి తీసిన మంత్రులు, శాసనసభ్యులు చేస్తున్న వందల కోట్ల కుంభకోణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తీన్మార్ మల్లన్నను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
కాగా, జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మను బెదిరించారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు ఆగస్ట్ 27న రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సికింద్రాబాద్ సివిల్ కోర్టులో ఆయనను హాజరుపరచగా.. సెప్టెంబర్ 9వరకు కోర్టు రిమాండ్ విధించింది. అదే సమయంలో మల్లన్న బెయిల్ పిటిషన్ వేశారు.
ఇది కూడా చదవండి: విజయమ్మ ఆత్మీయ సభపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య