Thursday, November 21, 2024

Questions – వీట‌న్నింటికీ కార‌ణమెవ‌రు? కాంగ్రెస్‌పై ప్ర‌శ్న‌ల కేటీఆర్‌ వ‌ర్షం

సిటీ కాలేజీ వ‌ద్ద కాల్పుల్లో విద్యార్ధుల దుర్మ‌ర‌ణం
వారి త్యాగాల‌కు ప్ర‌తిరూప‌మే అమ‌ర‌వీరుల స్థూపం
తెలంగాణ మ‌లి ఉద్య‌మంలో 370 మందిని కాల్చి చంపిది మీరే
సోనియాను బ‌లిదేవ‌త‌గా అభివర్ణించింది రేవంత్ అంటూ సెటైర్లు
ట్విట్ట‌ర్‌లో ప‌లు అంశాల‌పై కాంగ్రెస్‌ని నిల‌దీసిన బీఆర్ఎస్ నేత‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్న వేళ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ లోగో మార్పు, గీతంపై ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై ట్డిట్ట‌ర్ (ఎక్స్‌)లో ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -

= తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు.. అన్ని ప్ర‌శ్నించి.. దీనికి జ‌వాబు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాదా అంటూ నిల‌దీశారు.

= 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు?.. కాంగ్రెస్ ప్ర‌బుత్వం కాదా ..

= 1971 లోక్‌స‌భ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాదా..

= దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు?.. కాంగ్రెస్ ప్రభుత్వం క‌దా…

= 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు?.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..

= రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరు? … సోనియా గాంధీ కాదా.. ఈ మాట అప్పుడు రేవంత్ రెడ్డినోటి నుంచి వ‌చ్చిన ఆణిముత్యం కాదా అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement