Tuesday, November 26, 2024

strange: మూలుగు బొక్క‌ కోసం గొడ‌వ‌… ర‌ద్ద‌యిన పెళ్లి

ఎక్క‌డైనా మ‌ర్యాద‌ల్లో చేసిన లోపంతోనే లేక క‌ట్న కానుక‌ల విష‌యంలో లేక వ‌ధువుకు ఇష్టం లేక‌నో పెళ్లి ఆగిపోవ‌డం చూశాం. కానీ మూలుగు బొక్క కోసం పెళ్లి ర‌ద్ద‌యిన విచిత్ర ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో జ‌రిగింది.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. నవంబరు మొదటి వారంలో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ నిశ్చితార్థ వేడుకలో భాగంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. తర్వాత ఇరువర్గాలు శాంతించినా పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement