Thursday, January 23, 2025

MBNR | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి ప్రతినిధి, జనవరి 23(ఆంధ్ర ప్రభ) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్, ఉజ్జన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డిలు పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకుల విద్యాలయంలో వారు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 40% డైట్ చార్జీలను కాస్మోటిక్ చార్జీలను పెంచిందని, వీటితో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్బులను నిర్మిస్తోందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 43పనుల మంజురీలను కోరుతూ, ఉద్యాన శాఖ తరఫున మంజూరు చేసే తుంపర సేద్యంకు సంబంధించి 3600యూనిట్లను మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి నేరుగా నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆఫ్జలుద్దీన్, బీసీ సంక్షేమ శాఖ అధికారి సుబ్బారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement