Saturday, December 14, 2024

TG | విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం.. మంత్రులు

  • ఎంజేపీ లో డైట్ ప్రారంభించిన మంత్రులు
  • విద్యార్థులతో కలిసి సహ‌పంక్తి భోజనం
  • అభివృద్ది పనులు ప్రారంభించిన మంత్రులు దామోదర, దుద్ధిళ్ల
  • ఘన స్వాగతం పలికిన ఎమెల్యే జీఎస్ఆర్


ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమ‌ని, ప్రజా ప్రభుత్వంలో డైట్ చార్జీలు పెంచడం అభినందనీయమ‌ని మంత్రులు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ల‌ శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటనకు వచ్చిన మంత్రులకు రేగొండ మండలం రామన్నగూడెం హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే ఘన స్వాగతం పలికారు.

అనంతరం భగీర్తిపేట స్టేజి వద్ద బుద్దారం – కొడవటంచ రహదారి పనులను రూ.50కోట్లతో ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గాంధీనగర్ మహాత్మ జ్యోతి భా పూలే గురుకులంలో నూతన డైట్ ఛార్జీల పెంపును మంత్రులు లాంఛనంగా ప్రారంభించి అనంతరం విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేసి గురుకులంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆయుష్ కళాశాలను ప్రారంభించి, రూ.26కోట్లతో నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రిలో రూ.7 కోట్లతో 3వ అంతస్తు, మౌలిక వసతులను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాల బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement