Tuesday, November 19, 2024

గోదావరి వరద ఉధృతిని పరిశీలించేందుకు భద్రాచలం చేరుకున్న పువ్వాడ

వరదల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐటీసీ గెస్ట్ హౌస్ లో మంత్రి పువ్వాడను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ పోప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ వినీత్, ఏఎస్పీ అరితోష్ పంకజ్ తదితరులున్నారు. మరికాసేపట్లో గోదావరి కరకట్టపై వరద ఉధృతిని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేగ కాంతారావుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

కాగా… రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవాళ 11గంటల నుండి వరద ఉదృతి తగ్గే వరకు భద్రాచలంలోనే ఉండి మంత్రి పువ్వాడ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement