ఖమ్మం : పేరుకే జాతీయ పార్టీ అని, ఊరుకో విధానం అమలు చేయడమే ఆ పార్టీ విధానమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.. ఆ పార్టీకి చెందిన రాహుల్ గాందీ లీడర్ కాదని, అయన కేవలం రీడర్ మాత్రమే నని వ్యాఖ్యానించారు.. రైతుల గురించి,ఉచిత విద్యుత్ గురించి ఏమి తెలియని రేవంత్ రెడ్డి వాళ్లు రాసిన ఇచ్చిన స్క్రిప్ప్ చదివి వెళ్లి పోతారంటూ మండిపడ్డారు.. మధిర నియోజకవర్గం చింతకాని రైతు వేదికలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో రవాణా శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, “రైతులకు కేవలం 3గంటల విద్యుత్ ఇవ్వాలి అని చేసిన వ్యాఖ్యల పట్ల రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. వ్యవసాయంకు కావాల్సిన ప్రధానమైనది విద్యుత్. రైతులకు నేడు కేసీఅర్ 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్లే పంటలు విస్తారంగా పండుతున్నాయని అన్నారు. ఒకప్పుడు పక్క రాష్ట్రాల నుండి ధాన్యం దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎన్నడు లేని విధంగా నేడు మనమే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థితికి చేరుకున్నా” మన్నారు.
“ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు అన్ని విద్యుత్ సంస్థలు కలిపి సరఫరా చేసింది కేవలం 7800 మెగా వాట్స్ మాత్రమేనని.., నాడు రైతులు తమ మోటార్లకు ఆటో స్టార్టర్లకు పెట్టుకునే దుస్థితి ఉండగా.. ఎప్పుడూ కరెంట్ వచ్చేదో.. పోయేదో తెలియదనీ.. ఒకేసారి అన్ని మోటార్లు స్టార్ట్ అయ్యే సరికి మోటార్లు కాలిపోయేవి అన్నారు. కానీ కేసీఅర్ వచ్చాక ఆ దుస్థితి ఉండొద్దు అని రైతులకు 24గంటలు ఉచితంగా ఇచ్చామని” అన్నారు..
మన సీలేరు పవర్ ప్లాంట్ ను అప్పనంగా ఆంధ్రకు అప్పజెప్పారనీ ఆరోపించారు. 7800 మెగా వాట్స్ గా ఉన్న విద్యుత్ సామర్ధ్యం నేడు దాన్ని 18వేల మెగా వాట్స్ కు తీసుకొచ్చారని, రెప్పపాటు కరెంట్ పోకుండా రైతులకు నిర్విరామంగా విద్యుత్ అందిస్తున్నామ న్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి, అనేక నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మించేందుకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందనీ తెలిపారు. మీకు దమ్ముంటే రైతులకు 24గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే మీ పార్టీ కండువా కప్పుకుంట అని అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ సభలో కేసీఅర్ కి సవాల్ విసిరారని గుర్తు చేశారు మంత్రి పువ్వాడ.
రైతుల కోసం దాన్ని సవాల్ గా తీసుకున్న కేసీఅర్ కేవలం 3నెలల వ్యవధిలోనే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు దాదాపు 30 లక్షల బోర్లు నడుస్తున్నాయని, వాటిపై వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు రైతు బిడ్డలం అన్న ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని, మిమ్మలని చూస్తే వ్యవసాయం చేసే ఎడ్లు కూడా బెదిరిపోతున్నాయని, కేవలం తమ స్వార్థం కోసమే రైతులను వాడుకుంటున్నారని విమర్శించారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆనాడు ఇచ్చిన అరకొర విద్యుత్ కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేదని అంటూ, నేడు రేవంత్ రెడ్డి నేడు నిస్సిగ్గుగా అసలు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దు అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏజెంట్ గా కాంగ్రెస్స్ పార్టీ ని నడిపిస్తున్నారన్నారు రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని, ఉచితాలు ఇవ్వొద్దు అని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు.