ఖమ్మం – కాంగ్రెస్ నేత మాజీ మంత్రి రేణుక చౌదరి పై మంత్రి పువ్వాడ అజయ్ నిప్పులు చెరిగారు. ఆమె తనపై చేసిన ఆరోపణలపై న్యాయ పోరాట చేస్తానన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవాకులు చవాకులు పేలితే జాగ్రత్త అని హెచ్చరించారు.. సీట్లు ఇప్పిస్తాననిగిరిజనుల వద్ద డబ్బులు వసూలు చేసుకోవడం ఆమె హాబీ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా రేణుక చౌదరి పువ్వాడని టార్గెట్ చేసుకొని విమర్శల జోరు పెంచారు. పువ్వాడ అజయ్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని అన్నారు.
ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఆత్మీయ ప్లీనరీ సందర్భంగా జరిగిన సభలో పువ్వాడ మాట్లాడుతూ రేణుక చౌదరి అవాకులు చవాకులు పేలుతున్నారని, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు..ఆమె మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేనని , తనకు తండ్రి , మా పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత నేర్పించాలని అన్నారు. రేణుక చౌదరి ఎన్నికల అప్పుడు జిల్లాకి రావడం సీట్లు ఇప్పిస్తానని గిరిజనుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఆమెకు అలవాటని ఆరోపించారు .గత ఏడాది కాలం నుంచి తనపై రేణుక చౌదరి విమర్శలు చేస్తుంటే మా మహిళలు కూడా చాలా ఓపికతో ఉన్నారని ఇదే పరిస్థితి కొనసాగితే రేణుక చౌదరిపై న్యాయపోరాటం చేస్తానని పువ్వాడ జై స్పష్టం చేశారు. రేణుక చౌదరి కుటుంబం సభ్యులు క్లబ్బులకే పరిమితమైందని కూడా ఆరోపించారు. ఆమె ఖమ్మం జిల్లాకు గెస్ట్ మాత్రమే నని,తాను ఇక్కడే పుట్టి, పెరగానని అన్నారు.. దమ్ముంటే తనపై పోటీ చేయమని పువ్వాడ సవాల్ విసిరారు.