Wednesday, November 20, 2024

బిజెపి కో హటావో దేశ్ కి బచావో – పువ్వాడ

ఖమ్మం – )బిజేపికో హఠవ్.. దేశ్ కో బచావ్.. అనే నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం CPI పార్టీ అధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు యాత్ర సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీని అడ్డుకని వారిని శాశ్వతంగా పారదొలాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో TRS నుండి BRS గా మార్చి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నామని అన్నారు.

జాతీయ పార్టీగా ఉండి పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని, వారి అసమర్థత కారణంగానే నేడు బీజీపీ రెండు స్థానాల నుండి నేడు అధికారంలోకి రాగలిగింది అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలకు స్వార్ధాలు ఉండవని, పీడిత, తాడిత ప్రజలకు అండ దండలుగా ఉండాలనే చూస్తారని, నిత్యం ప్రజా సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలవకపాయినా కూడా దొడ్డి దారిన ప్రభుత్వాన్ని అనుభవిస్తుంది బిజెపి అని, బురద గుంటలో పోర్లిన నాయకులు లాగా బీజీపీ వ్యవహరిస్తున్నాయని అన్నారు.

బిల్కిస్ బానో కేసుల్లో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో నిందితులకు శిక్షకు తగ్గిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు.. గోద్రా సంఘటనలో కొన్ని వేల మంది ముస్లిం బిడ్డలు మరణించారు.. ఆ పాపం మీది కాదా అని ప్రశ్నించారు.. ఒకప్పుడు INCOME TAX CBI, ED లు నిందించి, వారి ఎలాంటి హోదా లేదు అని చెప్పి నేడు అదే సంస్థలను నేడు బీజీపీ వ్యతిరేకుల పైకి పంపి కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటన్నారు.

- Advertisement -

జాతీయ పార్టీగా ఉన్న CPI ని చిన్న చిన్న తప్పులు సాకుగా చూపి జాతీయ పార్టీ కాదు అని ఎలక్షన్ కమిషన్ తో చెప్పిస్తున్నారని ద్వజమెత్తారు. పేదల జన్ దన్ ఖాతాలు తెరవండి.. మీ ఖాతాల్లో ధన్ ధన్ మని డబ్బులు వేస్తామని చెప్పారు… అదేంటి అని ప్రశ్నిస్తే అదంత జుమ్లా అని అమిత్ షా చెప్పడం సిగ్గుచేటన్నారు.

ఇక తెలంగాణలో బిజేపి నాయకులకు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. బండి సంజయ్ కి నోరే తిరగదు.. నోటి నిండా తంబాకే ఉంటదని, వారి నోట చాలా హేయమైన బాషా.. హేళన మాటలు వాళ్ళకే సాధ్యమన్నారు.కమ్యునిస్టు పార్టీల ఐక్యత అనివార్యం, అత్యవసరమని అన్నారు. కమ్యునిస్టు ఉద్యమానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సిపిఎం, సిపిఐ పార్టీలు సంయుక్తంగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

Toతెలంగాణ లో మొదలైన ఈ ఐక్యత దేశానికి దిక్సూచిగా ఉండాలని, లౌకిక శక్తులన్నీ ఏకమయ్యేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. బిజెపి మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని కోరారు.మోడీ చెబుతున్న అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో లేదని తెలిపారు. ప్రజల సొమ్ముతో చేస్తున్న కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రారంభిస్తూ.. నేను తప్ప ఎవరూ చేయలేరని మోడీ ప్రచారం చేస్తున్నారని ఇది వారి అవివేకానికి పరాకాష్ట అని వివరించారు

. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జానీ మియా, కార్పొరేటర్లు చామకూరి వెంకన్న, బిజె క్లెమెంట్ పలువురు నాయకులు పాల్గొన్నారు.వా

Advertisement

తాజా వార్తలు

Advertisement