ఖమ్మం – : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు… శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించిన రీతిలో మనం కూడా శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు.ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, శ్రీరాముని అనుగ్రహముతో అన్నిరంగాల్లో పురోగాభివృద్ధిని సాదించాలని.. ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.
నేడు రాష్ట్రంలో మండుటెండల్లో కూడా చెరువులు, చెక్ డ్యామ్ లు మత్తళ్ళు దుంకుతున్నాయని, శ్రీ రామరాజ్యంలా నేడు తెలంగాణ రాష్ట్రం ఉందని, రైతులు ఆనందంతో పాడి పంటలతో రెండు పంటలు పండించి సంతోషంగా ఉన్నారు అనే సంతృప్తి ఉందని ఆకాంక్షించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుష్కలంగా ఎన్ఎస్పి జలాల సరఫరాతో బీడులుగా ఉన్న భూములు నేడు వేల ఎకరాలు సాగులోకి వచ్చాయని, సీతరామ ప్రోజెక్ట్ పూర్తి అయిన తరువాత లక్షల ఎకరాలకు నిర్విరామంగా సాగునీటిని అంది ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారి శ్రీ రామరాజ్యాన్ని తలపిస్తుందన్నరు.ముఖ్యమంత్రి కేసీఅర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని వర్గాల్లో అనందాలు, సంతోషాలు విరజిల్లుతున్నాయని, ఇదే ఒరవడి కొనసాగాలని భగవంతున్ని ప్రార్థింస్తున్నా అని అన్నారు. ప్రతి గ్రామంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని వేడుకను వైభవోపేతంగా జరుపుకోవాలని, ప్రజలందరు ఆనందోత్సాహాల మధ్య సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.