Saturday, November 23, 2024

ఖమ్మంలో వాడ వాడ కు మంత్రి పువ్వాడ

-పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు
-తక్షణమే కాల్వలకు అంచనాలు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశం

-క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారమే వాడ వాడ పువ్వాడ లక్ష్యం
ఖమ్మం : వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ నందు శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.


ఈ సందర్భంగా మంత్రి డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో వేయాల్సిన రోడ్లు, సైడ్ డ్రైన్ అంశాలపై స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఆయా పనులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ని ఆయన అదేశించారు. అసంపూర్తిగా ఉన్న సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట కొత్త సైడ్ కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అదేశించారు.

విద్యుత్, త్రాగునీరు, పారిశుధ్యం, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర్ మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ కూరాకుల వలరాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్, డీసీసీబీ చైర్మన్ కే.నాగభూషణం, మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, మునిసిపల్ ఇఇ క్రిష్ణ లాల్, డిఈ ధరణి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, విద్యుత్ ఏడిఈ రమేష్, తహసిల్దార్ శైలజ, నాయకులు పగడాల నాగరాజ్, దెవభక్తుని కిషోర్ బాబు, అంజిరెడ్డి, కన్నం ప్రసన్న కృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement