భీమవరంలో అదుపులోకి సెల్‌ఫోన్ ద్వారా ట్రాకింగ్
ధ్రువీకరించని పోలీసులు
హైదరాబాద్, : గత ఎనిమిది రోజుల నుండి కనిపించకుండా పోయిన పెద్దపెల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్ర వారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ప్రత్యే క బృందం పుట్ట మధు ను భీమవరంలో సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న జడ్పీ చైర్మన్ ను పోలీసులు విచారణ కోసం తరలించినట్లు తెలిసింది. గత నెల 30న ఈటల వ్యవహారం బయటకు వచ్చిన రోజు నుండి పుట్టమధు అజ్ఞాతంలోకి వెళ్లారు. గన్‌మెన్లను దించి వేసి ప్రైవేటు వాహనంలో వెళ్లిన జడ్పీ చైర్మన్ ను అదుపులోకి తీసుకునేందుకు పలు పోలీసు బృందాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాయి. చివరకు సెల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే పుట్టమధు కర్ ను అదుపులోకి తీసుకు న్న అంశాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీ కరించడం లేదు. గురువారం పుట్టమధు సతీ మణి మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ రాష్ట్ర మంత్రులను కలిసి విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరిన విషయం విదితమే. వామన్ రావు దంపతుల హత్య కేసులో అరెస్టు చేస్తారనే భయంతో పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లారని, ఈటల అక్రమ భూ వ్యవహారంలో పాత్ర ఉండటంతోనే అజ్ఞా తంలోకి వెళ్లారు అని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పుట్ట మధు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు, పోలీసులు ఎందుకు పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు, టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి ఎందుకు తీసుకున్నా రనే అంశాలు తెలియరాలేదు. ఒక రోజు గడిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.