రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ ప్రభుత్వం మార్కుఫెడ్ ద్వారా కేడీసీ ఎమ్మెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా అమలు చేయడంతోపాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశారన్నారు ఎమ్మెల్యే దాసరి. రైతులు పండించిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మార్కెట్ ఛైర్మెన్ శంకర్ నాయక్, వైస్ ఛైర్మెన్ జడల సురేందర్,డైరెక్టర్ లు,మార్కెట్ కార్యదర్శి, సిబ్బంది, హమాలీ సోదరులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.