Tuesday, November 26, 2024

గ్యాస్ బండకు దండం పెట్టు.. బీజేపీని బొంద పెట్టు.. కమలాపూర్ లో టీఆర్ ఎస్‌ వినూత్న ప్రచారం

Karimngar: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్ప‌టి నుంచి పెట్రో ఉత్పత్తులు, గ్యాస్ బండ‌ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. దీంతో ప్రజలకు ఈ విష‌యాన్ని తెలిపేందుకు టీఆర్ ఎస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెరలేపింది.

హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా కమలాపూర్ మండలంలో టీఆర్ ఎస్‌ శ్రేణులు గ్యాస్ సిలిండర్ బొమ్మలను తయారుచేసి పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రజలకు వివరిస్తూ వినూత్న ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

ఈనెల 30న జరిగే పోలింగ్ లో గ్యాస్ బండకు మనసులో దండం పెట్టుకొని.. బీజెపీని బొంద పెట్టాలని కోరుతున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టీర్ ఎస్ చేప‌ట్టిన ప్రచారం ఆకర్షిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement