Friday, November 22, 2024

TS: గ్యారెంటీ కార్డుతో రేవంత్ రెడ్డి బిర్లా టెంపుల్ లో పూజ‌లు… నాంప‌ల్లి ద‌ర్గాలో ప్రార్ధ‌న‌లు

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్ర నేతలు అందరూ తమ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జి. కిష‌న్ రెడ్డి పాత‌బ‌స్తీలోని భాగ్య‌లక్ష్మీ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. ఆయ‌న బాట‌లోనే కాంగ్రెస్ నేత‌లూ ప‌ట్టారు.. ఈరోజు ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, నరేందర్ రెడ్డి, వీహెచ్ తదితరులు బిర్లా టెంపుల్‌లో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి ప్రత్యేక అభిషేకం చేయించారు..

అంత‌కు ముందు గాంధీభవన్ నుంచి రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ పలువురు నేతలు బిర్లా టెంపుల్‌కు బయలుదేరారు. అయితే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఐదుగురు మాత్రమే వెళ్లాలని సూచించారు. దీంతో రేవంత్, ఠాక్రే, అంజన్ కుమార్, మల్లు రవి మాత్రమే బిర్లా మందిర్ కు వెళ్లారు.. అనంత‌రం నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement