Tuesday, November 26, 2024

భట్టికి ఆలేరు సమస్యలను ఏకరువు పెట్టిన ప్రజలు

ఆలేరు – పీపుల్స్ మార్చ్ లో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆలేరు ప్రజలు సమస్యల ఏకరువు పెట్టారు. శ్రీనివాసపురం గ్రామం మీదుగా పటేల్ గూడెం రైతు వేదిక వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతు కాల్వ శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి పది రోజులు అవుతున్న ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు ప్రతి రోజు ధాన్యం తడుస్తుండడం వల్ల గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ పోరాటంలో ఎదురొడ్డి నిలచి, నిజాం సైన్యాన్ని తరిమికొట్టిన చరిత్ర ఆలేరుకు ఉందన్నారు. పోరాటాల ఖిల్లాగా పేరొందిన ఆలేరులో సమస్యల నిలయంగా మారిందని, రాష్ట్ర వస్తే ప్రజలు బాగుపడుతారని అనుకుంటే ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి దంపతులే బాగు పడ్డారే తప్ప ప్రజలు బాగుపడలేదన్నారు.

అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం 5ఏళ్ళు గడుస్తున్నా ఇంత వరకు అతిగతి లేదన్నారు. గంధమల్ల ప్రాజెక్టుల నిర్మాణంపై స్పష్టత లేదని నేతలు స్పష్టం చేశారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పటు చేయాలని విన్నవించిన ఫలితం లేదని చెప్పారు. పటేల్ గూడెం మహిళలు భట్టి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. తమ ఊర్లో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, చదువుకున్న పిల్లలకు కొలువులు రాలేదని గ్రామానికి చెందిన రమ్య, మాలతి,రేనుకలు తదితర సమస్యలు మొరపెట్టుకున్నారు.-

Advertisement

తాజా వార్తలు

Advertisement