నీవు పోస్ట్ చేసిందే ఫేక్
నిపుణుల ముందు పెడదాం…రా
రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్
క్రిశాంక్ తో జైలులో కేటీఆర్ నేడు ములాఖత్
హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జరి.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అని కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడ జైలులో కూర్చోవాలో కూడా తేలుద్దాం. ఇకనైనా బుద్ది, సిగ్గు తెచ్చుకొని వెంటనే క్రిశాంక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ క్షమాపణ చెప్పాల్పిందే ..
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్‌గూడ జైల్లో ములాఖత్ అయ్యారు. మన్నె క్రిశాంక్‌ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. క్రిశాంక్ పోస్టు చేసిన సర్క్యులర్ తప్పా..? అని ప్రశ్నించారు. చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. రేవంత్ సర్కార్ చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిశాంక్‌పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.