హైదరాబాద్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రం సమయంలో ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటి ఆవరణకు వెళ్లి నిరసనలు తెలిపింది. అంతటితో ఆగకుండా జేఏసీ నేతలు ఇంటిపైకి రాళ్లు, టమాటాలు విసిరారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు.
కాంపౌండ్ వాల్ ఎక్కి ఆందోళనలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురిని ఆరెస్ట్ చేసారు పోలీస్ లు.