కడెం జులై 27 ప్రభా న్యూస్ – కడెం ప్రాజెక్టుఈ దుస్థితికి ప్రధాన కారణం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులేనని BRS ప్రభుత్వం,మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే రేఖ నాయక్ వ్యతిరేకంగా కడెం మండల కేంద్రంలో గురువారం ఉదయం డౌన్ డౌన్ నినాదాల స్థానిక ప్రజలు మారు మోగించారు. కడెం కు వచ్చినఎమ్మెల్యే , మంత్రి కాన్వాయ్ అడ్డగించారు. గత సంవత్సరం జరిగిన ప్రమాదకర పరిస్థితిని ద్రుష్టిలో పెట్టుకోకపోవడంతో ఈ సంవత్సరం కూడా ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక BRS ఎమ్మెల్యే రేఖా నాయక్ కాన్వాయ్ ని అడ్డుకోని ఆందోళన చేశారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య మంత్రి కాన్వాయ్ ని ప్రాజెక్టు వద్దకు తీసుకు వెళ్లారు. అడ్డుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ సందర్బఃగా కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది.
రాష్ట్రమంత్రి ఐ కే రెడ్డి ను నిలదీసిన కాంగ్రెస్ నేత సతీష్ రెడ్డి అరెస్టు
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు కు రాష్ట్ర అటవీ న్యాయశాఖ దేవదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరు సతీష్ రెడ్డి మరియు కొందరు కడెం ప్రజలుఐ. కే రెడ్డి డౌన్ డౌన్ మంత్రి గో బ్యాక్ నినాదాలు చేస్తూ రాష్ట్ర మంత్రి ఐ. కే రెడ్డి ను కడం ప్రాజెక్ట్ కు వస్తున్న వరద ప్రమాద మోరా ఇస్తున్న వరద గేట్లు కడెం ప్రాజెక్టు వరద గేట్లమరమ్మతులకు అభివృద్ధికి పట్టించుకోకపోవడంపై ప్రశ్నించారు దీంతో మంత్రి ఐ. కే రెడ్డిని ప్రశ్నించిన సతీష్ రెడ్డిని కడం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కుతరలించారు