Tuesday, November 26, 2024

బోథ్ రెవెన్యూ డివిజన్ కోసం ఆమరణ నిరాహాదీక్ష

బోథ్ అక్టోబర్ 10 ప్రభ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మంగళవారం రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని గత 87 రోజులుగా దీక్షలు, నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకుండా పోయిందని, అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవని రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిగో ప్రకటిస్తాం అదిగో ప్రకటిస్తాం అంటూ పబ్బం గడిపి తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలైనప్పటికీ ఉద్యమాన్ని నేరుగారిచే దిశగా అధికార పార్టీ నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు.

ఏమాత్రం ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు చేయని చోట అడగకుండానే రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ 87 రోజులుగా రిలే నిరాహార దీక్షలు ర్యాలీలు ధర్నాలు రాస్తారోకలు ప్రభుత్వం మీద నమ్మకంతో శాంతియుతంగా రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమాన్ని చేపట్టిన గాని బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోవడం అధికార పార్టీ విఫలమైందని రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు.

- Advertisement -

ఇదివరకే రిటర్నింగ్ ఆఫీసర్ బోథ్ ఎన్నికల అధికారి కి పలుమార్లు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆవశ్యకత గురించి వివరించిన గాని తమ ప్రాంత ఆస్తిత్వ, ఆత్మ గౌరవాన్ని ఎవరు పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం దిష్టికి తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు దిశగా సహకరించాలని సాధన సమితి సభ్యులు కోరారు.

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేంతవరకు తమ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement