దేవరుప్పుల, జులై 9 (ప్రభన్యూస్): దేవరుప్పుల మండల కేంద్రంలోని గత పది మాసాల నుండి డబుల్ బెడ్ రూమ్ లో ఉంటున్న లబ్ధిదారులను మంగళవారం ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఆందోళన చెందిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు వాటర్ ట్యాంక్ పై కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేపట్టారు. దీంతో పోలీసులు, అధికారులు వచ్చినప్పటికీ తమకు ఎమ్మెల్యే హామీ ఇచ్చేంత వరకు వాటర్ ట్యాంక్ దిగేది లేదని లబ్ధిదారులు అన్నారు.
- Advertisement -