నిజమాబాద్ – మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలనీ ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
సోమవారం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓ మయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చక్రపాణి, అధ్యక్షురాలు సాయమ్మలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్య లపై సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభు త్వం స్పందించకపోవడం బాధా కరమన్నారు. గత రెండు రోజు ల క్రితం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,డిఇఓ లతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల వేతనాలు జూలై నెల నుండి పెంచుతున్నట్లు ప్రకటన చేయడం సమంజసం కాద న్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 18 నెలల క్రితం కార్మికుల వేతనం 3000 పెంచుతున్నట్టు ప్రకటన చేసిన, మంత్రి కొత్త ప్రకటన చేయడం సరికాదన్నారు . కార్మికులు పిల్లలకు వంట చేసి పెట్టిన 9 నెలల బకాయి బిల్లు లు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలే దన్నారు .వంట పాత్రలు పిఎఫ్ ఈఎస్ఐ గుర్తింపు కార్డులో ప్రభుత్వం ఇవ్వాలని అంగ న్వాడీ సెంటర్ల మాదిరిగా నిత్యవసర వస్తువులను ప్రభు త్వమే స్కూళ్లకు సరఫరా చేయాలని వీటి పై స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూని యన్ ఏఐటీయూసీ నాయకు లు నాగలక్ష్మి, పెద్దమ్మ, సాయ మ్మ ,లక్ష్మీబాయి, గంగమణి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.