హైదరాబాద్: మణిపుర్ అల్లర్లు, గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘చలో రాజ్‌భవన్’ చేపట్టారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.సీఎం రేవంత్‌రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు దీనిలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం రాజ్‌భవన్ సమీపంలో రోడ్డుపై సీఎం రేవంత్, మంత్రులు, నేతలు బైఠాయించి నిరసన తెలిపారు.