Friday, September 6, 2024

Protest – స్కూల్ లో ఫీజుల దందా – విద్యార్థి తండ్రి అర్థ నగ్న ప్రదర్శన

నాగోల్ జూలై 9(ప్రభ న్యూస్) – ప్రైవేటు స్కూలా యాజమాన్యం వసుళ్లు చేస్తున్న అక్రమ ఫీజుల పై ఓ విద్యార్థి తండ్రి అదే పాఠశాల ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపిన సంఘటన నాగోల్ డివిజన్ కృషి నగర్ లో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలలోకి వెళితే… నాగోల్ కృషి నగర్ లోని అక్షర టెక్నో స్కూల్ లో ధర్మారెడ్డి అనే పేరెంట్ పిల్లలు గతంలో చదివారు.ఈ క్రమంలో ఫిజులు కట్టలేక ఆరు సంవత్సరాల క్రితం వేరే స్కూల్ కు మార్చాడు. దీంతో నూతన స్కూల్ వారు బోనోఫైడ్ టీసీ కావాలని అడగాగా 6ఏళ్ళు గా అక్షర టెక్నో స్కూల్స్ వారు బోనోఫైడ్ టీసీ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని, యాజమాన్యం కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని ఆరోపించారు. విది లేక మంగళవారం అక్షర టెక్నో స్కూల్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపాడు. ప్రవేట్ స్కూల్ ల అక్రమ ఫీజు ల వసూళ్ల ను ప్రభుత్వం అరికట్టాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement