ఈ మధ్య ఎక్కడ చూసినా మహిళలు, అమ్మాయిలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. వెంటపడి వేధింపులకు గురిచేయడం కాదంటే.. కత్తులతో దాడిచేసి చంపేయడం.. తీవ్రంగా గాయపరచడం వంటివి హైదరాబాద్ మహానగరంతోపాలు తెలుంగాణలోని పలు జిల్లాల్లో ఎదురవుతున్నాయి. అయితే.. మహిళలకు అండగా ఉండేందుకు పోలీసుశాఖ మరిన్ని రక్షణ చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా వారికి సహాయం అందించేందుకు వేగవంతమైన చర్యలు చేపడుతోంది..
విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా సైబరాబాద్‌లోని విమెన్ అండ్ ప్రొటెక్షన్ వింగ్ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్‌కు కూడా ప్రకటించింది. రైట్ టు అపోజ్ యాక్ట్ 354డి ఐపీసీ ప్రకారం మహిళలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఎవరైనా కావాలని మహిళలు, యువతుల వెంటపడితే ఐపీసీ సెక్షన్ 354డి ప్రకారం చట్టపరమైన చర్యలుంటాయని పోలీసు అధికారులు వెల్లడించారు. పదే పదే మహిళలను, యువతులను వెంబడించడం.. ఇంట్రస్ట్ లేదని చెప్పినా ఇంటర్నెట్ ద్వారా కానీ, స్మార్ట్‌ఫోన్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.
ఇట్లాంటి వేధింపులను ఎవరైనా ఎదుర్కొంటే.. డైరెక్ట్‌గా షీటీమ్స్ నెంబర్‌కు సంప్రదించాలని విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్ కోరింది.. ఈ నెంబర్ 9490617444 వాట్సాప్‌కు మెస్సేజ్ చేస్తే చాలు.. మీకు రక్షణగా మేముంటామని పోలీసు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily