Friday, November 22, 2024

సింగరేణిలో1000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదన : సీఎండీ శ్రీధర్‌

సింగరేణి సంస్థ ఇప్పటికే 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ణు ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తుండగా.. మరో 1000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నది. ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అంద జేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ సోలార్‌ విభాగం ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సింగరేణి భవన్‌లో సింగరేణి థర్మల్‌, సోలార్‌ ప్రాజెక్టులపై డైరెక్టర్‌ సత్యనారాయణరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్‌, థర్మల్‌ విద్యుత్‌ రంగాల్లో అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు తగు అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించే నిరూపయోగ, ఖాళీ స్థలాల్లో సోలార్‌ ప్లాంట్‌ను దశల వారిగా ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు. సింగరేణి సోలార్‌లో 3వ దశలోని 66 మెగావాట్ల ప్లాంట్లను ఏఫ్రిల్‌ నెలలోగా టెండర్లు పూర్తి చేయాలని, మే నుంచి పనులు ప్రారం భించాలన్నారు. సింగరేణిలో ఏర్పాటు చేసిన 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట నుంచి ఇప్పటి వరకు 21.29 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయిందన్నారు. సింగరేణి విద్యుత్‌ ఖర్చుల్లో సంస్థకు రూ.65.27 కోట్ల మేర ఆదా చేకూరిందని వివరించారు. గడిచిన ఐదు నెలలల్లో వరరుసగా 90శాతం పైగా పీఎల్‌ఎఫ్‌ను సాధిస్తూ దేశంలోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ప్లాంట్లలో సింగరేణి నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement