హైదరాబాద్, (ప్రన్యూస్): దీర్ఘకా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సీఎం కేసీఆర్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలు త్వరలో పరిష్కరించి పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని సూచించినట్లుగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపినట్లుగా టీఆర్‌టీఎఫ్ (తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్) నేతలు వెల్లడించారు.
టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, కటకం రమేష్ లతో కూడిన బృందం ఉపాధ్యా య, విద్యారంగ సమస్యల పరి ష్కారం కోసం మంత్రిని హైదరా బాద్‌లో కలిసినట్లు ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ పదోన్న తులు, బదిలీల ప్రక్రియతో పాటు అంతర్ జిల్లా బదిలీలను త్వరి తగతిన చేపట్టడానికి ఈమేరకు మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కస్తూర్భా పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు ఇతర మహిళా ఉద్యోగులకు మాదిరిగానే 27 ఆకస్మిక సెలవులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily