తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అయిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రచారానికి వాడుకుంటోంది. కనీసం ఈ పథకానికి ఒక్క నయాపైసా కూడా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఇంటింటికీ తాగునీటి పథకానికి కేంద్రం నుంచి 19వేల కోట్ల నిధులు సమకూర్చాలని నీతి ఆయోగ్ చేసిన సూచనలను అసలు కేంద్ర పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా తమ పథకాలను కేంద్రం చేపట్టిన పథకాలుగా ప్రచారం చేసుకోవడానికి కొంచెమన్న సిగ్గు ఉండాలని ఎద్దేవా చేశారు కేసీఆర్. ఈ మేరకు ఇవ్వాల కేంద్రం జల్ జీవన్ మిషన్‌లో చేపట్టినట్టుగా ఉన్న ఓ యాడ్ ఫొటోని తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడుది వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం తీరుమీద, బీజేపీ నేతల మీద పిచ్చి పిచ్చిగా కామెంట్స్ వస్తున్నాయి.
తెలంగాణ పథకాలను కేంద్ర పథకాలుగా ప్రచారం.. కొంచెమన్న సిగ్గుండాలే అన్న కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement