Friday, September 20, 2024

TG: ప్రముఖ వైద్యునికి బెదిరింపులు…!

డబ్బులు ఇవ్వకుంటూ…నీ సంగతి చూస్తాము..!
కష్టపడి చదివి డాక్టర్ అయ్యాను
ఏజెన్సీ ప్రజలకు సేవలు అందించడం నేరమా
మణుగూరు లో వైద్య సేవలు అందించాలంటే భయం వేస్తుంది…!
నా కుటుంబానికి ఏదైన జరిగితే వారే బాధ్యులు
సెల్ఫీ వీడియోతో కన్నీటి పర్వమైన డాక్టర్ శశిధర్

మణుగూరు, సెప్టెంబరు 3(ప్రభ న్యూస్): మణుగూరులో వైద్య సేవలు అందించాలంటే భయం వేస్తుంది.. అంటూ ఓ ప్రముఖ వైద్యులు అవేదనను వ్యక్తం చేశారు.. ఏజెన్సీ ప్రజలకు సేవలందించడం తప్పు, అంటూ నిరంతరం పగలు, రాత్రి తేడా లేకుండా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు.

అసలు ఏం జరిగింది ఆ వైద్యులు ఎందుకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడో తెలుసా …

- Advertisement -

కొంతమంది డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, లేకుంటే నీ అంతూ చూస్తామని భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, మణుగూరు పట్టణంలో సాయి మమత హస్పటల్ ను స్థాపించి, పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో కూడా సేవలు అందిస్తున్నానని డాక్టర్ శశిధర్ తెలిపారు. కొంతమంది తన ఎదుగుదలను ఓర్వలేక, డబ్బులు ఇవ్వాలంటూ లేకుంటే వైద్య వృత్తిని ఎలా నిర్వర్తిస్తారంటూ, బెదిరింపులకు పాల్పడుతూ నీ సంగతి చూస్తామని నిత్యం భయభ్రాంతులకు గురిచేస్తున్నరని వాపోయాడు. ఎంతో కష్టపడి పని చేసుకుంటూ, ట్యూషన్ లు చెప్పుకుంటూ వైద్య చదువులు చదివానని తెలిపాడు. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి తన హాస్పిటల్ కి వచ్చి ఎంతోమంది రోగులకు, డబ్బులు లేకున్నా వైద్య సేవలు అందిస్తున్నాని తెలిపారు.

కానీ కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు ఇవ్వకుంటే నీ హాస్పిటల్ ఉండదు అంటూ, నువ్వు కూడా వైద్య వృత్తిని వదిలి మణుగూరును విడిచి వెళ్లిపోయేలా చేస్తామంటూ వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపాడు. నువ్వు కాకుంటే మరో డాక్టర్ వస్తారని, నువ్వొక్కడివే నా వైద్యుడు అంటూ, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తన గోడును వెళ్లబుచ్చుకున్నారు.

మణుగూరులో వైద్య సేవలు అందించాలంటే, కొంతమంది వల్ల భయపడాల్సి వస్తుందని తెలిపారు. వారి వల్ల నా కుటుంబానికి ఏదైనా జరిగితే, పూర్తిగా వారి పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా సూసైడ్ చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ శశిధర్ సెల్ఫీ వీడియో వాట్సప్ లో రావడంతో, పట్టణంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, మెడికల్ షాప్ యజమానులు, ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement