Sunday, November 24, 2024

TG | ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్‌ బాల‌కృష్ణారెడ్డి

  • వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తం
  • కోఠి మహిళా యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ధనావత్‌ సూర్య
  • విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు
  • ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ, హైద‌రాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాళ (బుధ‌వారం) ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. వీరిద్ద‌రూ ఆయా ప‌ద‌వుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.

ఈ రెండు నియామ‌కాల‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాల‌కు ఇన్‌చార్జి వీసీల‌ను ప్ర‌భుత్వం మార్చింది. కోఠి మహిళా యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ధనావత్‌ సూర్య, బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను నియమించారు. కాగా, సూర్య ప్ర‌స్తుతం ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ క‌ళాశాల తెలుగు విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement