వరంగల్ – రాష్ట్రంలో భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం రాత్రి రెండు రోజులు(బుధ ,గురువారాలు) విద్యాసంస్థలకు సెలువులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఇంకా జంట నగరాల లోని లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో నే వున్నాయి. కాగా ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తు భారీ వర్షంలో సైతం పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ఇవ్వకుండ నడిపిస్తున్నారు.
దేశాయిపేట రోడ్డు లోని ఓయాసిస్ , నాగార్జున స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ప్రవేట్ స్కూల్స్ ప్రభుత్వ సెలవు దినాలను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలుతో పాఠశాల నడిపించాయి. ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.