జన్నారం, (ప్రభ న్యూస్) : బ్యాంకు ప్రైవేటు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పొనకల్- జన్నారం శాఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్.ఓ.ఎస్. ప్రైవేట్ ఉద్యోగి పి.సాయికుమార్…. మండలంలోని హాస్టల్ తండాకు చెందిన పర్శాక ఎర్రయ్య దగ్గర రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.20వేలు లంచం ఇస్తే… రుణ మాఫీ డబ్బులు రూ.లక్ష 80వేలు ఇస్తానని డిమాండ్ చేయగా, గురువారం సాయంత్రం రూ.15వేలు అతనికి ఇచ్చానని బాధిత రైతు తెలిపారు.
ఈ తరుణంలో రైతు మిత్రులు ముగ్గురు వీడియో చిత్రీకరించారు. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ మహేష్ ను, ఎఫ్.ఓ.ఎస్. ప్రైవేట్ ఉద్యోగి సాయికుమార్ ను నిలదీసి, పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. పలువురి రైతుల నుంచి రుణమాఫి వ్యవహారంలో ఆ ప్రైవేట్ ఉద్యోగి ఫోన్ పే ద్వార డబ్బులు ట్రాన్స్పర్ చేయించుకున్నట్లు ఆ రైతుల వద్ద ఆధారాలు ఉన్నట్లు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎస్సై గుండెటి రాజవర్ధన్ ను సంప్రదించగా, దర్యాప్తు చేస్తున్నామన్నారు.