Monday, November 18, 2024

TG | అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత.. మంత్రి శ్రీధర్‌ బాబు

  • లాభాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేశాం..
  • మొక్కలను నాటండి.. ఆహ్లాదాన్ని పంచండి..


రామగిరి, అక్టోబర్‌ 28 (ఆంధ్రప్రభ): సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ- ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. సోమవారం సింగరేణి సంస్థ, రామగుండం-3 ఏరియా ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ సమీపంలో 9 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు రూ.3కోట్ల 56 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎకో పార్క్‌కు మంత్రి శ్రీధర్‌ బాబు శంకుస్థాపన, భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు, ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా భాగస్వాములను చేశామని, గొదావరిఖనిలోని సింగరేణి మెడికల్‌ కళాశాలలో 7శాతం సీట్లు- ఉద్యోగుల పిల్లలకు వచ్చేలా ఏర్పాటు చేస్తామని, మున్ముందు సింగరేణిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెపడతామన్నారు. ఎకో పార్కునందు సుందరీకరణ కోసం వివిధ రకాల మొక్కలు నాటడమే కాకుండా బట్టర్ ఫ్లై గార్డెన్‌, లైటింగ్‌, వాటర్‌ ఫౌంటేన్లు, పక్షుల సందర్శన కేంద్రం తదితర వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ ఎకో పార్క్‌ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఎకో పార్కు నిర్మాణ పనులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారి దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం జి.యం. కార్యాలయం నందు మహిళా ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రెచ్‌ (శిశు సంరక్షణ కేంద్రం) భవనాన్ని ప్రారంభించి, మహిళా ఉద్యోగులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రామగుండం-3 ఏరియా జనరల్‌ మేనేజర్‌ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌ కొప్పుల వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వై.వి.రావు, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌ బి.జనక్‌ ప్రసాద్‌, అధికారుల సంఘం అధ్యక్షులు వెంకటరమణ, రామచంద్రారెడ్డి, కోట రవీందర్‌ రెడ్డి, ఎస్వోటు-జిఎంలు జి.రఘుపతి, బి.సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్‌ వై.విజయశేఖరబాబు, ఫైనాన్స్‌ విభాగాధిపతి శ్రీనివాసులు, సివిల్‌ విభాగాధిపతి రాజేంద్ర కుమార్‌, పర్యావరణ అధికారి పి.రాజారెడ్డి, ఫారెస్ట్రీ అధికారి కళ్యాణ్‌, అధికారులు చంద్రశేఖర్‌, షబ్బీరుద్దీన్‌, గుర్రం శ్రీహరి, ఐలయ్య, రాజేశ్వరి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement