తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. మహబూబ్నగర్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని తెలంగాణకు రెండు ప్రధానమైన హామీలను ఇచ్చారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పసుపు బోర్డును ఇవ్వాల ప్రకటించారు మోదీ. ఈ అయిదేండ్లుగా కాలం వెళ్లదీసిన బీజేపీ రానున్న ఎన్నికలను దృషిటలో పెట్టుకుని పసుపు బోర్డును ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక.. ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీని ప్రకటించారు ప్రధాని. 900 కోట్లతో సమ్మక్క, సారలమ్మ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కోట్లాది రూపాయలకు చెందిన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Exclusive | తెలంగాణకు ప్రధాని వరాలు.. పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!
Advertisement
తాజా వార్తలు
Advertisement