Tuesday, November 26, 2024

IIT: హైదరాబాద్ ఐఐటీని జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోడీ

తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు కోసం కంది గ్రామంలో 576ఎకరాలు కేటాయించగా, ఫిబ్రవరి 27, 2009లో అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

20వేల మంది విద్యార్థులతో పాటు 10వేల మంది బోధన, ఇతర సిబ్బంది కోసం క్యాంపస్‌ నిర్మాణాన్ని 2010లో ప్రారంభించారు. భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా సంస్థ కలిసి 2019 వరకు మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేశాయి. జూలై 2015లో ఐఐటీ హైదరాబాద్‌ను ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి కందిలోని శాశ్వత క్యాంపస్‌లోకి మార్చారు. మొదటి దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా కలిసి సుమారు రూ.1700 కోట్లు ఖర్చు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement